భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థుల స్క్రూట్నీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఈ మేరకు నామినేషన్ వేసిన అభ్యర్థులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు జలగం వెంకటరావు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ ను అధికారులు రిజెక్ట్ చేశారు.అదేవిధంగా జలగం వెంకటరావు వేసిన కేసులో 24 గంటల్లోపు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకురావాలని బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర రావుకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఐపీసీ 170 ప్రకారం వనమా నామినేషన్ తిరస్కరించాలని జలగం అన్నారు.జీవిత భాగస్వామి పేరు, ఆస్తులను ప్రకటించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డాక్యుమెంటరీ రుజువులు సమర్పించిన జలగం వనమా నామినేషన్ ని తిరస్కరించకపోవడానికి కారణాలను చెప్పాలని విజ్ఞప్తి చేశారు.దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా మరోసారి చిక్కుల్లో పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. అదేవిధంగా ఆందోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి తరపు న్యాయవాదులు ఇవాళ మీడియా సమావేశంలో వెల్లడించారు.