వరల్డ్ కప్ వైఫల్యంతో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా !

-

వరల్డ్ కప్ 2023 లో పాకిస్తాన్ కనీసం సెమి ఫైనల్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో నాలుగు మాత్రమే గెలిచి ఒక అడుగు దూరంలో సెమీస్ కు చేరకుండా ఆగిపోయింది. ఈ ప్రభావం పాకిస్తాన్ క్రికెట్ ను కకావికలు చేస్తోంది చెప్పాలి. ఈ దారుణమైన వైఫల్యానికి కారణంగా మొదట బాబర్ ఆజం ను కెప్టెన్ గా దిగిపోవాలంటూ అభిమానులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందు చీఫ్ సెలెక్టర్ గా ఉన్నా ఇంజమామ్ ఉల్ హాక్ వరల్డ్ కప్ మధ్యలోనే తొలగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అన్ధతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ గా ఉన్న సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ మోర్న్ మోర్కెల్ రాజీనామా చేశారు.

వాస్తవంగా మోర్కెల్ ఈ సంవత్సరం జూన్ నెలలోనే ఆరు నెలల కాంట్రాక్టు కోసం బౌలింగ్ కోచ్ గా వచ్చారు. ఇక ఎలాగు డిసెంబర్ తో సమయం పూర్తి కానుండగా ఈ లోపే రాజీనామా చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news