తనపై 139 మంది లైంగికదాడికి పాల్పడటమే కాకుండా కులం పేరుతో దూషించారంటూ ఓ మహిళ వంద పేజీల ఫిర్యాదు ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పంజాగుట్ట స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. పోలీసులు సైతం ఈ కేసు విషయమై చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. 139 మంది దాదాపు 5000 సార్లు తనపై లైంగికదాడికి పాల్పడ్డారంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ 139 మంది చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నట్టు తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే బాదితురాలు చెబుతున్న ప్రకారం ఈ లిస్ట్ లో ప్రముఖ యాంకర్ పేరు ఉన్నట్టు తెలుస్తుంది. యాంకర్ తో పాటు సినీ నిర్మాతలు, ఓ కెమెరా మెన్, ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్, మాజీ ఎంపీ, వాళ్ల పీఏ.. వాళ్లతో పాటు ఓ డాక్టర్ కూడా ఉన్నాడని ఆ యువతి తెలిపింది. కాగా, ప్రస్తుతం ఈ కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. దీంతో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆ దిశగా దర్యాప్తు చెయ్యనున్నట్లు తెలిపారు.