కరోనా కారణంగా 5 నెలలుగా మూతపడ్డ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. లాక్‌డౌన్ నేపధ్యంలో మార్చి 21 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. అయితే కరోనా నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 8 గంటల నుంచి11 గంటల వరకు.. మళ్లీ తిరిగి సాయంత్రం 5 నుంచి సాయంత్రం దీపారాధన సమయం వరకూ పద్మనాభస్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇక స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందు రోజు సాయంత్రం 5 గం.కు ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేయించుకోవాలని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో గరిష్టంగా 665 మంది భక్తులను మాత్రమే అలయంలోకి అనుమతించనున్నారు. అదేవిధంగా 10 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులుగా పేర్కొంది.