బీఆర్ఎస్ కి మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ అధినేత కేసీఆర్కు వరస షాకులిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలు, సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ కేవలం 39 సీట్లను సాధించి ప్రతిపక్షంలో వెళ్లింది. అదేవిధంగా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని 64 సీట్లలో విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అదేవిధంగా, అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. కొందరు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ మారితే.. మరికొందరు తాము అధికారంలో ఉండగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకునేందుకు మళ్లీ అధికార పార్టీలోకి వెళ్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కి తేరలేపింది.

Read more RELATED
Recommended to you

Latest news