ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ ముగిసింది. ఇవాళ ఉదయం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం జగన్.. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
ఇక ఆ తరువాత లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి వెళ్లిపోయారు. తన తల్లి విజయమ్మతో కలిసి లంచ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ని కలవడం.. షర్మిల లేని సమయంలో తల్లి విజయమ్మను జగన్ కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.తల్లి విజయమ్మతో జగన్ దాదాపు అరగంటకి పైగా భేటీ అయ్యారు. పలు విషయాల గురించి చర్చించారు. సీఎం జగన్ రెండు సంవత్సరాల నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చారు. చివరిసారిగా శ్రీ కృష్ణుడి వేడుకలకు హాజరయ్యారు. తాజాగా సీఎం జగన్ లోటస్ పాండ్ లోని నివాసానికి చేరుకొని దాదాపు 40 నిమిషాల పాటు బేటీ అయ్యాడు. జగన్ అక్కడికి రాగానే పలువురు అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ పర్యటన ముగించుకొని బేగంపేట ఎయిర్ ఫోర్ట్ కు బయలుదేరి వెళ్లారు.