టీఎస్ స‌రిహాద్దుల్లో ఏపీ వ‌రి ధాన్యం

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన లారీ ల తో కూడిన‌ వ‌రి ధాన్యం గద్వాల్ గుండా తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. అయితే వ‌రి ధాన్యం లారీ ల‌ను తెలంగాణ అధికారులు అడ్డు కున్నారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో భారీ వ‌ర్షాలు ప‌డ‌టం తో వ‌రి ధాన్యం త‌డిసింది. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు లో ఆల‌స్యం జ‌రుగుతుంది. దీంతో లారీ ల‌లో వ‌రి ధాన్యాన్ని తెలంగాణ కు తీసుకువ‌స్తున్నారు.

దీంతో లారీ ల ను తెలంగాణ అధికారులు నిలిపి వేశారు. కాగ ప్ర‌స్తుతం తెలంగాణ లో కూడా వ‌రి ధాన్యం కొనుగోలు లో తీవ్ర జాప్యం జ‌రుగుతుంది. తెలంగాణ లో కూడా ఇటీవ‌ల వ‌ర్షాలు ప‌డ‌టం తో వ‌రి ధాన్యం త‌డిసింది. దీంతో తెలంగాణ లో కూడా వ‌రి ధాన్యం మార్కెట్ల లో వ‌రి ధాన్యం అలాగే ఉంటుంది. అయితే తెలంగాణ కు చెందిన వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌డ మే సాధ్యం అవ‌డం లేదు. ఇలాంటి సంద‌ర్భం లో ఏపీ నుంచి వ‌చ్చిన వ‌రి ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తార‌ని ఇక్క‌డి రైతులు అంటున్నారు.