వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా..? అంటూ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా..రేవంత్ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. దిగుబడి లేక సతమతం అవుతోన్న రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు కవిత. ఒకపక్క వ్యాపారుల మోసం, మరోపక్క ప్రభుత్వం శీతకన్ను వేయడం వల్ల… వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని ట్వీట్ చేశారు.
పోలీసుల బందోబస్తు నడుమ వేరుశనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరం అని ఫైర్ అయ్యారు. తక్షణమే ప్రభుత్వం మేల్కొని వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని… మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమిషన్ దారుల ఆగడాలను అరికట్టాలని కవిత డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత.
వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు?
అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ఒకపక్క వ్యాపారుల మోసం, మరొపక్క ప్రభుత్వం శీతకన్ను వేయడం వల్ల వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోంది.
పోలీసుల బందోబస్తు నడుమ… pic.twitter.com/91Kr66QIRp
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 29, 2025