నిన్న ఒక్కరోజే 5 కోట్లు.. నేడు ఉదయం 8 గంటలలోపే 4 కోట్ల మంది పుణ్యస్నానాలు : సీఎం యోగి

-

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 20 మంది వరకు మృతి చెందగా, వంద మందికి పైగా భక్తులు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది.నేడు మౌని అమావాస్య సందర్బంగా భక్తులు అత్యధికంగా రావడంతో బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉండగా, నేడు మౌనిఅమావాస్య కారణంగా త్రివేణి సంగమంలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చారని.. ఈ రోజు ఉదయం 8 గంటలలోపే 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా.. నిన్న ఒక్కరోజే 5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా ఘాట్లలోనే స్నానాలు చేయాలని అధికారులు సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version