సేవల అంతరాయంపై స్పందించిన హైదరాబాద్ మెట్రో..

-

హైదరాబాద్‌లో మెట్రో సేవలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నేటి ఉదయం సుమారు గంట పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం కాలేజీకి వెళ్లేవారు, ఉద్యోగస్తులు ఇలా ప్రతిఒక్కరూ గంట పాటు స్టేషన్‌లోనే ఎదురుచూడాల్సి వచ్చింది.

దీంతో మెట్రో స్టేషన్స్ అన్ని చాలా రద్దీగా మారిపోయాయి. దీనిపై మెట్రో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే నిలిచిన మెట్రో సేవలపై హైదరాబాద్ మెట్రో సంస్థ తాజాగా స్పందించింది. సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని తెలిపిన హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. దయచేసి ప్రయాణికులు కోపరేట్ చేయాలని అభ్యర్థించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version