రేపే నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో రేపు బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న బహిరంగసభ వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణానికి నలువైపులా కిలోమీటర్ల మేర గులాబీ రంగు సంతరించుకుంది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో.. సభ ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. బీఆర్ఎస్ గా పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో అధిష్ఠానం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు జోగు రామయ్య, షకీల్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గాదరి బాలమల్లు, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రవీందర్‌ సింగ్‌ తదితరులు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?