కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసి మహిళపై ఆగస్టు 31వ తేదీన అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది. ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన బందుకు సంపూర్ణ మద్దతు లభించింది. నిందితుడిని ఉరితీయాలంటూ వేలాదిమంది ఆదివాసీలు, జైనురు మండల కేంద్రానికి తరలివచ్చి నిరసన నిర్వహించారు.
ఈ నిరసనలో ఆదివాసీలు ఓ వర్గానికి చెందిన పాన్ షాపులోని సామాగ్రిని రోడ్డుపైకి తీసుకువచ్చి నిప్పంటించారు. దీంతో ఆ వర్గం వారు ఆందోళనకు దిగి కొంతమంది దుకాణాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలపై తాజాగా ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించవద్దని అన్నారు. ఈ హింసకాండపై అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ( డిజిపి ) జితేంద్ర తో కూడా మాట్లాడానని తెలిపారు. అదైనపు బలగాలను పంపిస్తున్నామని, నిరసనకారులపై చర్యలు తీసుకుంటామని డిజిపి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు ఓవైసీ.