మునుగోడులో రైతును చితకబాదిన ఏఎస్ఐ !

-

మునుగోడులో పోలీసులు దౌర్జన్యానికి దిగారు. మునుగోడులో రైతును చితకబాదాడు ఓ ఏఎస్ఐ. ఇద్దరు రైతుల మధ్య భూవివాదం కొంతకాలంగా నడుస్తోంది. అయితే… పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో పొలం పనులు ముగించుకుని వస్తానని ప్రాధేయపడ్డాడు రైతు ముత్యాలు. కానీ అక్కడే ఉన్న ఏఎస్‌ఐ రెచ్చిపోయాడు.

ASI Kothisingh was the first to crush the farmer in front of everyone

అందరి ముందు రైతును చితకబాదాడు మునుగోడు ఏఎస్ఐ కోఠిసింగ్. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతును కొట్టే అధికారం మునుగోడు ఏఎస్ఐ కోఠిసింగ్ కి ఎవరూ ఇచ్చారని మండిపడుతున్నారు రైతులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news