సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట. నవదంపతులకు పెళ్లి జరుగుతుందంటే అందరికీ సంతోషంగానే ఉంటుంది. ఆ పెళ్లి తరువాత చోటు చేసుకునే పరిణామాలతో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు చాలా బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా భర్తలు భార్యలను వరకట్న వేధింపులు అని.. అనుమానం, లైంగిక వేధింపులు ఏదో ఒకవిధంగా భార్య ఇబ్బంది పడుతూనే ఉంటుంది.
ఇలా భార్యలు ఇబ్బందులు పడుతున్నారని.. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు అమలులోకి వచ్చాయి. కానీ అవి సరైన విధంగా అమలు కావడం లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానంతో భార్యను భర్త నరికాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ MIGలో ఘటన చోటు చేసుకుంది. తీవ్ర రక్త స్రావమైన ఆ మహిళకు సిటిజెన్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు.