ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో దారుణం.. అంబులెన్స్ డ్రైవర్లపై దాడి

-

ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో దారుణ సంఘటన చోట చేసుకుంది. కామినేని ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లపై గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా  దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్ల కారణంగా పక్కనే ఉన్నటువంటి న్యూ మల్టీ కార్ కి సంబంధించి సరిగ్గా గిరాకి రావడం లేదనే కారణంతో అంబులెన్స్ డ్రైవర్లపై దాడి చేశారు.

దాదాపు గంట పాటు గొడవ కొనసాగింది. ఆ తరువాత దాడి చేసిన న్యూ మల్టీ కార్ సిబ్బంది పై అంబులెన్స్ డ్రైవర్లు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారని న్యూ మల్టీ కార్ వ్యాపారి మనుషులతో దాడి చేయించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news