R టాక్స్, U టాక్స్ అంటున్నారు.. ఇడ డబ్బులే లేవురా నాయనా – కోమటిరెడ్డి

-

R టాక్స్, U టాక్స్ అంటున్నారు.. ఇడ డబ్బులే లేవురా నాయనా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4 తరువాత కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు రోడ్లపైన తిరుగుతారు..BRS పార్టీ ఆఫీస్ లకు తాళాలే ఉంటాయని బాంబ్‌ పేల్చారు. BRS నాయకులు రైతుల గురించి మాట్లాడితే వాళ్లని చెప్పులతో కొట్టండి అని రైతులకు చెప్పినట్లు పేర్కొన్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.. నంది హిల్స్ నుంచి కారు న్యూట్రల్ చేసిన అసెంబ్లీకి వస్తుందని పేర్కొన్నారు. హోం మినిస్టర్ మొహముద్ అలీ కేవలం దట్టి కట్టడానికే సరిపోయాడు..మా ముఖ్యమంత్రి దగ్గరకు అపాయిట్మెంట్ లేకుండా పోవచ్చు అన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎలానో.. రేవంత్ అలానే..సామాన్యులను కూడా మా సీఎం కలుస్తాడన్నారు. పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు..ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్పా.! అని నిలదీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news