బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్..!

-

బెంగళూరులో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ప్రస్తుతం కర్ణాటకతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఆ రేవ్ పార్టీలో ఉన్న వారి పేర్లు బయటికి వస్తుండటంతో కొందరు తాము అసలు ఆ రేవ్ పార్టీలో లేమని ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. అయితే ఈ రేవ్ పార్టీ చాలా కాస్ట్లీ పార్టీ అని తెలుస్తోంది.

తాజాగా బెంగళూరు  రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కొటిక్ టీమ్ పరీక్షించింది. పరీక్షించిన  డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. అందులో టాలీవుడ్ సినీ నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం.   ఇందులో పలువురు సీనిప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నట్టు సమాచారం. ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. ముందు ముందు ఇంకెంత మంది ఈ పార్టీలో పాల్గొన్నారో చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news