టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్‌రెడ్డి గెలుపు.. సంబరాల్లో బీజేపీ శ్రేణులు

-

ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి విజయం సాధించారు. ఇక దీనిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. ధర్మం వైపు నిలిచిన ఉపాధ్యాయుల, అధ్యాపకుల విజయం అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి గారి విజయం, టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి టీచర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొన్నారు.

నియంతృత్వ, నియంత పోకడలకు పోయే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం, ఉపాధ్యాయ వ్యతిరేక కేసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మా వెంట నడుస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి గారికి శుభాభినందనలు. వారికి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. టీచర్ల సమస్యల పరిష్కారానికి మేం మరింత ఉధృతంగా పోరాడేందుకు ఈ విజయం ప్రేరణనిస్తుందన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news