క్రికెట్ బెట్టింగ్‌లో 25 లక్షలు లాస్.. బీటెక్ విద్యార్థి సూసైడ్

-

క్రికెట్ బెట్టింగ్‌లో 25 లక్షలు లాస్ అయి.. బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి చింత వినీత్(25) రూ.25 లక్షలు అప్పు తెచ్చి బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు.

B.Tech student ends life due to loss in online cricket betting

తెచ్చిన అప్పులు చెల్లించే దారిలేక వినీత్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version