బైరి నరేష్ ని కఠినంగా శిక్షించాలి – జీవన్ రెడ్డి

-

హిందూ దేవుళ్ళపై, అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైరి నరేష్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మతాలను, విశ్వాసాలను కించపరిస్తే కేసులు పెట్టాలన్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని అన్నారు. నాస్తికులకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇతరులను కించపరుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి.

ఇటీవల నరేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నరేష్ ని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బైరి నరేష్ అరెస్టుపై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించుకోవాలని ఎస్పీ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news