సీఎం కేసీఆర్ కి బండి బహిరంగ లేఖ

-

దళితులు, గిరిజనుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్ చేసిన భూములకు మీ ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా.. వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం దుర్మార్గం అన్నారు. దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తానన్న హామీని మీ ప్రభుత్వం వమ్ము చేయడంతో లక్షలాదిమంది గిరిజనులు, దళితుల ఆశలు అడియాశలయ్యాయని లేఖలో పేర్కొన్నారు.

సిద్దిపేటలో మీరు ప్రారంభించిన వెంచర్ దళితుల భూముల్లోనే, శంషాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రయత్నిస్తున్నది గిరిజన భూముల్లోనే, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. రాష్ట్రవ్యాప్తంగా దళితులకు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను వారి నుండి లాక్కుంటున్న ఉదంతాలు కోకొల్లలు. మీ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని లేఖలో మండిపడ్డారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news