కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి ర‌ప్పించేది బీజేపీనే : బండి సంజ‌య్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఫామ్ నుంచి బ‌య‌ట‌కు ర‌ప్పించే ద‌మ్ము బీజేపీ కి మాత్ర‌మే ఉంద‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ అన్నారు. బీజేపీ చేస్తున్న పోరాట‌ల వ‌ల్లే.. కేసీఆర్ ఫామ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని అన్నారు. కాగ బండి సంజ‌య్ ప్రజా సంగ్రామ యాత్ర‌లో భాగంగా రెండో విడ‌త పాద‌యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాద‌యాత్రలో నేడు ఉండ‌వ‌ల్లిలో స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో బండి సంజ‌య్ మాట్లాడుతూ.. త‌మ పార్టీ వ‌ల్లే కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్ అక్క‌డి నుంచి ధ‌ర్న చౌక్ దీని త‌ర్వాత దేశం మొత్తం తిరుగుతున్నాడ‌ని అన్నారు.

కేసీఆర్ ను గ‌ద్దే దించే స‌మ‌యం వ‌చ్చింద‌ని అన్నారు. పాద‌యాత్ర‌తో టీఆర్ఎస్ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో లక్ష 20 వేల ఇళ్లు ఏక్క‌డ నిర్మించారో చూపించాల‌ని ప్రశ్నించారు. ఆర్డీఎస్ ప‌థ‌కాన్ని పాల‌మూర్ లో ఎందుకు పూర్తి చేయాల‌ద‌ని అన్నారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆర్డీఎస్ ప‌థ‌కాన్ని పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే కేసీఆర్ పాల‌న‌లో విద్యార్థులు, నిరుద్యోగు, మ‌హిళ‌లు, రైతుల‌, ఉద్యోగులు అంద‌రూ న‌ష్టపోతున్నార‌ని మండిప‌డ్డారు. త్వ‌ర‌లోనే కేసీఆర్ ను గ‌ద్దే దించుతామ‌ని దీమా వ్య‌క్తం చేశారు.