ఈరోజు కేసీఆర్ చేసే జిమ్మిక్కులు చూడాల్సిందే : బండి సంజయ్

-

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​లో పర్యటిస్తున్నారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్​లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి.. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను వివరించనున్నారు. అనంతరం కర పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కరీంనగర్​లోని చైతన్యపురి ప్రజలతో మాట్లాడుతున్నారు. వారికి మోదీ పాలనను వివరిస్తున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్​పై మండిపడ్డారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరులకు కేసీఆర్ నివాళులర్పించలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌… ఇవాళ ఏదో జిమ్మిక్కులు చేస్తారని.. టీవీ పెట్టుకుని మరి ఆ జిమ్మిక్కులు చూడాల్సిందే అని ఎద్దేవా చేశారు. ధరణి బాధితులను పిలిస్తే పరేడ్ గ్రౌండ్‌లో పెద్ద సభే అవుతుంది అని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసినా డబ్బు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2 గంటల్లో 10 లక్షల మందిని బీజేపీ శ్రేణులు కలిశారని చెప్పారు. దేశానికి మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ మీదనే నమ్మకం ఉందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news