కవిత పై చేసిన కామెంట్లపై బండి సంజయ్ క్లారిటీ

 

 

కల్వకుంట్ల కవిత పై చేసిన కామెంట్లపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదనీ…తెలంగాణ లో రెగ్యులర్ గా వాడే సామెతను నేను ప్రస్తావించానన్నారు బండి సంజయ్.ఎవరైనా తప్పు చేస్తే వయసు, జెండర్ తో సంబందం లేకుండా ఆ సామెతను వాడుతారన్నారు.

కవితక్కను అరెస్ట్ చేస్తారట అని మీడియా అడిగితే ముద్దు పెట్టుకుంటారా చేయకుంటే అని నేను సమాధానం ఇచ్చాను అని వెల్లడించారు బండి సంజయ్. మహిళా ల పై జరుగుతున్న అత్యాచారాల, అఘాయిత్యాలు పై బీజేపీ పోరాడుతూ ఉంది.. నేను ఒక రోజు నిరసన దీక్ష కూడా చేశాననీ పేర్కొన్నారు.

 

ప్రీతి ది హత్య…ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారు.. ఆ కుటుంబానికి బీజేపీ అండగా ఉంది…నేనిచ్చిన వివరణ ను పరిగణలోకి తీసుకొని తదుపరి ప్రొసీడింగ్స్ డ్రాప్ చేయాలని కోరాడు బండి సంజయ్.