బీఆర్ఎస్ ను నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తాం : బండి సంజయ్

-

వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు నివాసానికి వెళ్ళిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్.. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే విష్ణువర్దన్ రాజు నివాసం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేసారు. తెలంగాణలో హెచ్ ఆర్కే సర్కార్ నడుస్తోంది అని తెలిపారు.

ఇక బావ బామ్మర్థులిద్దరూ పోటీపడి మరి సీఎం రేవంత్ కు సహకరిస్తున్నారు. అందుకే కేటీఆర్ బామ్మర్థి ఫాంహౌజ్ ఘటనను నీరుగార్చారు. అయితే బూతులు తిట్టేటోడు నోటీసులిస్తే విలువేముంది.. ఆ నోటీసులకు బదులిచ్చా.. నోటీసులు కూడా ఇస్తా అని బండి పేర్కొన్నారు. ఇక 6 గ్యారంటీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ ను వెంటాడతాం. బీఆర్ఎస్ ను నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తాం అని హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news