గ్రేటర్ లో గేరు మార్చుతున్న ‘బండి’ కిరికిరి లో ‘కారు’ ? 

-

తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ అయినా… బిజెపి హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు అందరిలోనూ గతంలో ఎప్పుడూ లేనంత ధీమా కనిపిస్తోంది. అసలు ఎప్పుడు ఊహించని విధంగా ఇక్కడ బిజెపి బలపడడం , టిఆర్ఎస్ కు పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లడం, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడం , ఫలితం కూడా త్వరలో రాబోతుండడం తో అది తమ ఖాతలో పడుతుందని బిజెపి లెక్కలు వేసుకుంటోంది. ఈ కారణాలతో ఆ పార్టీ నాయకులు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. గతంతో పోలిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తి ప్రజల్లో పెరిగిపోయిందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని,  బిజెపి గట్టిగానే ప్రచారం చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ సైతం బలహీనపడడం , ఆ పార్టీ కి కలిసి వచ్చింది.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయిన దగ్గర నుంచి బీజేపీకి ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే దిశగా సంజయ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.గ్రేటర్ లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుక సరికొత్త ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ లో  ఆరుగురు అధ్యక్షులను నియమించారు. వారికి గ్రేటర్ బాధ్యతలను అప్పగించింది. దీంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో, అక్కడ కాలనీలో సహాయ కార్యక్రమాలను బిజెపి నేతలు పర్యవేక్షిస్తున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు.
గ్రేటర్ లో తన మార్క్ కనిపించే విధంగా బండి సంజయ్ టిఆర్ఎస్ కు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ , వ్యవహరిస్తున్న తీరుతో , ఆ పార్టీ కాస్త కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాగూ ఈ వరదల కారణంగా టిఆర్ఎస్ కు ప్రజావ్యతిరేకత పెరిగింది కాబట్టి, ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంలో బిజెపిని పరుగులు పెట్టించే పనిలో బండి సంజయ్ నిమగ్నం అయ్యారు. బిజెపి దూకుడు ఈ స్థాయిలో పెరిగిపోవడంతో అధికార పార్టీ టిఆర్ఎస్ కాస్త కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ లో పెరిగిన వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక టిఆర్ఎస్ సతమతమవుతున్నట్లు గా కనిపిస్తోంది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news