ఈనెల 6వ తేదీన బండి సంజయ్ నామినేషన్

-

తెలంగాణలో ఇవాళ్టి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నేటినుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల దాఖలు సమయంలో ఆర్‌వో కార్యాలయం 100 మీటర్ల పరిధిలోకి 3 వాహనాలకే అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీన నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. ఆయన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్లీ నుంచి కరీంనగర్ వస్తున్న బండి సంజయ్ వాహనాలను రెండు చోట్ల ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. రేణిగుంట టోల్‌గేట్ వద్ద అధికారులు ఓసారి తనిఖీ చేయగా…  కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తా వద్ద మరోసారి తనిఖీలు నిర్వహించారు. మేడిగడ్డ కుంగిన పిల్లర్లపై కేంద్ర బృందం ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని బండి సంజయ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న రాజశ్యామల యాగంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news