నేడు సీఎం జగన్ అధ్యక్షతన ఏపి కేబినెట్ భేటీ జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సందర్బంగా పలు కీలక అంశాలకు ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్. సుమారు రూ.19 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు ఇవాళ ఆమోద ముద్ర వేసే అవకాశం వేయనుంది ఏపీ కేబినెట్.
విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదికపై చర్చించనున్న కేబినెట్…రైతుల సమస్యల పై ఫోకస్ చేయనుంది. ఇది ఇలా ఉండగా సీఎం జగన్ తో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తాజాగా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం జగన్ కు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ హామీ ఇచ్చారు. పోలవరం ముంపు సమస్య పరిష్కరిస్తామని… ఉత్తరాంధ్ర, సీమ ప్రాజెక్టులకు సహకరిస్తామన్నారు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్.