కేశినేని నాని నన్ను ఎన్ని బూతులు తిట్టినా భరిస్తా – బుద్దా వెంకన్న

-

కేశినేని నాని నన్ను ఎన్ని బూతులు తిట్టినా భరిస్తానని వెల్లడించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. నన్ను ఎవరేం విమర్శించినా తొందరపడనని చంద్రబాబుకు మాటిచ్చా కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించను… నా స్పందన వల్ల పార్టీకి నష్టం చేకూర్చకూడదనే నేను మాట్లాడ్డం లేదని వెల్లడించారు.

కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని… బీసీ నాయకుడి అయిన నన్ను కేశినేని నాని ఎన్నోసార్లు అవమానించారు.. ఇప్పటికీ నాని గారంటూనే కేశినేని నానిని సంబోధిస్తానని వెల్లడించారు. కేశినేని నాని నన్ను ఎన్ని సార్లు అవమానించిన సైలెంటుగా ఉన్నానని.. ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడానని చంద్రబాబుకు మాటిచ్చానని ప్రకటన చేశారు.

నాని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని.. నానికి నాకు భేదాభిప్రాయాలు వచ్చి విడిగా ఉంటున్నామని చెప్పారు. గతంలో కేశినేని నానిపై నేను చేసిన వ్యాఖ్యలు పొరపాటే.. ఈ విషయాన్ని గతంలోనే ఒప్పుకున్నా…కేశినేని నానిని ఆ స్థాయిలో విమర్శించడంపై చంద్రబాబు నాపై అప్పట్లో కొప్పడ్డారన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version