నేను సచివాలయం కూల్చను..కానీ పునః నిర్మాణం చేస్తా – బండి సంజయ్

-

నేను సచివాలయం కూల్చను..కానీ పునః నిర్మాణం చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సచివాలయం మాదిరిగా కనిపించడం లేదు.. ఓవైసీ చెప్పారు తాజ్ మహల్ లాగా ఉందని చెప్పారన్నారు. ఓవైసీ కళ్ళలో ఆనందం కోసమే కట్టారని మండిపడ్డారు. నల్ల పోచమ్మ దేవాలయాన్ని ఎందుకు కట్టలేదని.. కాంగ్రెస్, BRS కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారని వివరించారు.

BRS ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని.. కేసీఆర్ పట్టుమని రోజుకు నాలుగు గంటలు కూడా పనిచేయడం లేదని ఫైర్‌ అయ్యారు. ప్రగతిభవన్ గడీల నుంచి పేదల కష్టాలు కనిపించవని.. సచివాలయం గతంలో బాగుండేనని విమర్శలు చేశారు. నల్ల పోచమ్మ గుడి కూడా కూల్చారు..రూ. 600 కోట్ల తో ప్రారంభించి సచివాలయం 1600 కోట్లకు పెంచి కమిషన్లు దండుకున్నారని ఆరోపణలు చేశారు.
దళిత బంధులో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని.. తెలంగాణ మొత్తం లంచాల మయంగా మారిందని ఆగ్రహించారు. కేసీఆర్ నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు… డ్రైనేజీ లో పాప పడి చనిపోయింది.. ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెల కడుతుందని మండిపడ్డారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news