ఎల్లారెడ్డిపేట మండల దుమాలగ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాల సందర్శించిన బండి సంజయ్ 10 తరగతి విద్యార్థినిలతో మమేకమై మాట్లాడారు. విద్యార్థినులతో పై చదువులు చదివిన తర్వాత మీరు ఏమవుతారు అని అడుగగా టీచర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పారు విద్యార్థులు. అయితే ఒక్కొక్క విద్యార్తిని పై కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1 లక్ష 9 వెల రూపాయలు ఖర్చు చేస్తుందని విద్యార్థినులకు తెలిపారు బండి సంజయ్. 2019 లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం. ఎస్టీ సామాజిక వర్గానికి వారు ఉన్నత చదువులు చదివి వారికున్న లక్ష్యాలను నెరవేర్చాలని సంకల్పంతో ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశాం.
దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య పాఠశాలలుంటే తెలంగాణలో 23 పాఠశాలలున్నాయి. దేశవ్యాప్తంగా భవనాలు లేని పాఠశాలకు 38 కోట్ల రూపాయలు నక్సల్స్ ప్రాంతాలకు 48 కోట్లతో నూతన భవనాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి పాఠశాలలో 480 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పటివరకు లక్షా ఇరవై వేల మంది ఉన్నత చదువులు చదివారు. తెలంగాణలో ఉన్న 23 ఏకలవ్య పాఠశాలలో 4000 మంది పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి నైపుణ్యాలు ప్రోత్సహించాలని పాఠశాలలు ఏర్పాటు చేశాం. విద్యార్థుకు ఉన్నత చదువులు చదివి వారి లక్ష్యాలకు చేరుకొని సమాజానికి మేలు చేయాలని కోరుతున్న అని బండి సంజయ్ అన్నారు.