తనని పార్టీ లోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గతంలో జగన్ ను ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కలిశా. రాజకీయాల్లో నా ఆస్తులు పోగొట్టుకున్నా. నేను వైసీపీ నుండి బయటకు వచ్చి ఆ పార్టీని విమర్శించటం నా క్యారెక్టర్ కాదు. కానీ వాళ్ళు నాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే అందరి విషయాలు బయట పెడతా అని హెచ్చరించారు.
ప్రజా తీర్పు మేరకు ఎమ్మెల్యే అయిన వ్యక్తికే అన్నీ హక్కులు ఉంటాయి. నేను పవర్ కోసం పాకులాడే వ్యక్తిని కాదు. ఒక్క డిమాండ్ కూడా పవన్ ముందు ఉంచలేదు. పవన్ ను కలవకముందే రాజీనామా చేసి వచ్చా. వైఎస్ఆర్ కోసమే గతంలో అన్నీ ఇబ్బందులు భరించా. భాదతో నా కళ్ళలో నీళ్ళు కూడా ఇంకిపోయాయి. పార్టీ లోని కోటరీ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. సమస్యలు ఏవైనా జగన్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన వ్యతిరేకంగా తీసుకున్నారు. జనసేన పార్టీకి గట్టి నాయకులు వస్తానంటే తీసుకువస్తాం. ఇక నాపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని సీఎం చంద్రబాబు కే లేఖ రాయడం జరిగింది అని బాలినేని పేర్కొన్నారు.