టిఆర్ఎస్ గెలిచే 15 సీట్లలో కేసీఆర్ ఉండరు – బండి సంజయ్

టిఆర్ఎస్ గెలిచే 15 సీట్లలో కేసీఆర్ ఉండరన్నారు బండి సంజయ్. కేసీఆర్ ని జైల్లో వేసే అవకాశం వస్తుంది… బీహార్ లో లాలుప్రసాద్ యాదవ్ చట్టపరంగా జైలుకు వెళ్ళలేదా ? అని పేర్కొన్నారు. న్యాయబద్ధంగా,చట్ట బద్ధంగా కేసీఆర్ ని జైల్ కి పంపుతాం…కేసీఆర్, కేసీఆర్ కుటుంబమే మాకు పెద్ద అస్త్రాలు… వేరే అంశాలు అవసరమే లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోటీ చేసే అంశం పై కొందరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెబుతున్నారు… పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. రాష్ట్రం లో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలిచేది బిజేపీనేనని…హైదరాబాద్ పార్లమెంట్ లో బిజేపీ గెలిస్తే…దేశంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నా పని.. పార్టీ పని అని…ఎవరు అడ్డుకున్నా.. పార్టీలో చేరికలు కొనసాగుతాయన్నారు.మోడీ నాయకత్వాన్ని బలపరిచే ఎవిరిని అయినా చేర్చుకుంటాం..చికోటి ప్రవీణ్ తో trs నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.రోజు ప్రెస్ మీట్ లు పెట్టీ మమ్మల్ని తిట్టే trs నేతలకు ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయన్నారు.