గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క గుర్తుంది కదా. బడా బడా నాయకులపై పోటీకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తాజాగా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. తన సమీప బంధువు వెంకటేశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. నాగర్ కర్నూల్‌జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రం పీఎంఆర్ గార్డెన్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శిరీష తన ప్రీ వెడ్డింగ్, పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బర్రెలక్క పెళ్లి గురించి తెలుసుకున్న నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష ఫేమస్ అయి ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను యూట్యూబ్‌లో 4.83లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 7.83లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 1.42 లక్షల మంది ఫాలో అవుతున్నారు.