రెండు రోజులపాటు వరుణుడు విశ్వనగరంగా చెప్పుకుంటున్న భాగ్యనగరాన్ని పరిశీలించాడు.. పరీక్షించాడు! ఈ విశ్వనగరంలో పాలకులు ఎంత జాగ్రత్తగా ఉన్నారు.. అధికారులు ఎంత ముందుచూపుతో ఉన్నారు.. సామాన్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనే విషయాలపై వరుణుడు టెస్ట్ చేశాడు. ఈ పరీక్షలో భాగ్యనగరానికి సున్నా మార్కులు వచ్చాయి! అయితే మరోసారి వరుణుడు భాగ్యనగరవాసులకు పరీక్ష పెట్టబోతున్నాడు!!
అవును… వరుణుడు భాగ్యనగర వాసులకు, అధికారులకు, పాలకులకు పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు వచ్చిన సంగతి తెలిసిందే! అయితే ఈ నెల 19న మరో పరీక్షకు రెడీ అవ్వాలని అంటున్నాడు వరుణుడు! ఈ క్రమంలో… మధ్యబంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని.. ఫలితంగా రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది!
ఉదాహరణకు జనాలు రోడ్లపై ఆఖరికి మొక్క జొన్న కంకులు తిని అవి అలానే పాడేస్తారు.. అవి చిన్న చిన్న నాళాల్లో ఇరుక్కుపోతుంటాయి.. ఫలితంగా ఆ నీరు పెద్ద నాళాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. చినికి చినికి గాలివానగా మారినట్లు.. ఇదికాస్త వరదై.. బ్రతుకు బురదవుతుంది!! ఇక అధికారులు పాలకుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! సో.. బీ కేర్ ఫుల్ భాగ్యనగరం!