సుధీర్ సరసన లవ్ టుడే భామ ఇవానా..!

-

సుడిగాలి సుదీర్.. జబర్దస్త్ లో వచ్చిన అవకాశంతో తనలో ఉన్న టాలెంట్ను నిరూపించుకున్నారు. తనకంటూ ప్రత్యేక క్రియేట్ చేసుకున్న సుధీర్ యాంకర్ రష్మితో చేసిన కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. బుల్లితెర హీరోగా మంచి పేరు సంపాదించుకున్న సుదీర్ ఇక్కడ నటిస్తూనే యాంకరింగ్ చేస్తూ సినిమాల వైపు అడుగులు వేశారు. ఇప్పటికే గాలోడు సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా త్వరలో సుధీర్ నటించబోతున్న సినిమాలో లవ్ టుడే హీరోయిన్ ఇవానా సుధీర్ కు జంటగా కనిపించనున్నట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

బుల్లి తెరపై అలరించిన సుధీర్ గాలోడు సినిమాతో తన టాలెంట్ నుండి నిరూపించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో హీరోగా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు తెలుస్తోంది. గాలోడు లాంటి మాస్ ఎంటర్ టైనర్ తో మంచి కలెక్షన్స్ అందుకున్న సుదీర్ నెక్స్ట్ సినిమాపై ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమాకు ప్రభాస్ డైరెక్టర్ దసరా దశకత్వం వహిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో లవ్ టుడే సినిమాతో మంచి స్టార్డం సంపాదించుకున్న ఇవానా హీరోయిన్గా కనిపించని ఉన్నట్టు తెలుస్తోంది.

Ivana – South Indian film actress best known for supporting roles in ...

లవ్ టుడే డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం.. ఇందులో ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా, ఇవాన, సత్యరాజ్‌, రాధికా శరత్‌ కుమార్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. కేవలం ఐదు కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ముఖ్యంగా ఈ సినిమాకి ఇవానా ప్లస్ గా నిలిచారు. కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సుధీర్ సినిమాలో ఇవానా హీరోయిన్గా కనిపిస్తే సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news