సాగు నీరు, విద్యుత్​ పై లేనిపోని అబద్ధాలు : భట్టి విక్రమార్క

-

సాగు నీరు, విద్యుత్​పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క విపక్షాలపై మండిపడ్డారు. హైదరాబాద్​లోని బషీర్​బాగ్​లో ఉన్న సురవరం ప్రతాప్​రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మీట్​ ది ప్రెస్​లో మాట్లాడారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని, ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని హెచ్చరించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతుందని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఇక్కడకు వచ్చానని తెలియజేశారు.

 రైతు బంధు ఇవ్వలేదని బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేశారని..  రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రమాణస్వీకారం చేసిన రోజు ఖజానాలో ఉన్నది మైనస్​ రూ.3960 కోట్లు అని స్పష్టం చేశారు. విద్యుత్​ సబ్సిడీ కింద రూ.3,924 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.  రాష్ట్రంలో ఎక్కడా పవర్​ కట్​ లేదని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్​ సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా నిధులు రూ.734 కోట్లు చెల్లించామని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news