ఫిబ్రవరి నెలలో ప్రస్తుత ప్రభుత్వం 1,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా.. మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది.
ఇవాళ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 12 దాటితే నెక్ట్స్ డే కిందికి వస్తుంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఇంకా ఎవ్వరైనా దరఖాస్తు చేసుకోని వారు కేవలం 8 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక జూన్ 19న సాయంత్రం నాటికి 2,72,798 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా.. ఇందులో 2.64 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ. 1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను tsdsc.aptonilne.in/tsdsc/ సందర్శించండి.