హైదరాబాద్ మహానగర ప్రజలకు HMWSSB అలర్ట్ జారీ చేసింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్దనున్న రిపేర్ చేసేందుకు గాను నెల 17న నగరానికి డ్రింకింగ్ వాటర్ సప్లై నిలిచిపోనున్నట్లు అధికారులు తెలిపారు. కొండపాక పంపింగ్ స్టేషన్ వద్దనున్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కు.. 900 ఎంఎండయా వాల్వులు (బీఎఫ్ అండ్ ఎన్ఆర్సీ) అమర్చనున్నారు. ఈ పనులు ఫిబ్రవరి 17 సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈ పనులు చేస్తారు. దీంతో రిపేర్లు జరగనున్న 24 గంటలు మహానగరంలోని అనేక ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ నిలిచిపోతుందని ప్రజలు పరిస్థితులను అర్ధం చేసుకొని సహకరించాలని HMWSSB అధికారులు కోరారు.
1. ఓ అండ్ ఎం డివిజన్-6 : ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ,
బంజారాహిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.
2. ఓ అండ్ ఎం డివిజన్-9 : కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మ బండ,
మూసాపేట్, భరత్ నగర్, మోతీనగర్, గాయత్రి నగర్, బాబానగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్,హస్మత్ పేట్.3. ఓ అండ్ ఎం డివిజన్-12 : చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం,
సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ.
4. ఓ అండ్ ఎం డివిజన్-13 : అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చ బొల్లారం.
డిఫెన్స్ కాలనీ, వాజ్పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం.