కేటీఆర్ కు బిగ్ షాక్..ఇవాళ జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేత ?

-

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు మరో షాక్‌ తగిలింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్దమైంది. శనివారం రోజున హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. ఇప్పుడు కేటీఆర్ ఉంటున్న జన్వాడ ఫాంమ్ హౌస్ కూల్చివేతకు అధికారులు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Big shock for KTR Demolition of Janwada farmhouse today

జీవో నెంబర్ 111కు విరుద్దంగా ఈ ఫామ్‌హౌస్ నిర్మించినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే రూల్స్ ఉల్లఘించి నిర్మించిన భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇక అటు హైదరాబాద్‌ లో చెరువులు, నాలాల కబ్జాను అరికట్టేందుకు హైడ్రాకు మరిన్ని పవర్స్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. హైడ్రా నీ బలోపేతం చేసే పనిలో సర్కార్ పడింది. హైడ్రా కి పోలీసు స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పోలీస్ స్టేషన్ స్టేటస్ తో… నేరుగా హైడ్రా నే FIR నమోదు చేసే వేసులు బాటు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news