తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు వస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్సులను కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాష్ట్రం లోని కొన్ని జిల్లాల్లో రద్దు చేసింది. మావోయిస్టు ప్రభావం తగ్గు ముఖం పట్టిందనే నేపథ్యంలోనే.. కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసు కున్నట్లు సమాచారం అందుతోంది.
గతంలో రాజధాని మినహా మిగిలిన ఉమ్మడి 9 జిల్లాల్లో ఈ అలవెన్స్ ఉండేది. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న కాలంలో శాంతి భద్రతల విభాగం, ఏఆర్, ప్రత్యేక పోలీస్ విభాగాల్లో పని చేసే వారికి ఇది వర్తించేది. ఈ అలవెన్సు ను గత నెల వరకు ఇస్తూ వచ్చారు. ఇకపై కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల ఉండబోదని తాజాగా ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు మౌళికంగా ఠాణాలకు సమాచారం అందించారు. ఇక కేసీఆర్‌తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పై కొంత మంది పోలీసులు నిరసన తెలుపుతున్నారు.