‘కండోమ్స్ కూడా కావాలా?’.. ఐఏఎస్ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

-

బిహార్ లో ఐఏఎస్ అధికారిణి హర్‌జోత్‌ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన హర్‌జోత్‌ను విద్యార్థినులు శఆనిటరీ నాప్ కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుందని అడిగారు. దానిపై స్పందించిన హర్‌జోత్‌.. ‘కోరికలకు ఓ అంతు అనేది ఉందా? ఈరోజు శానిటరీ నాప్‌కిన్స్‌ ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకొంటూ పోతే.. చివరకు కుటుంబ నియంత్రణ మాటకొస్తే కండోమ్స్‌ కూడా ఉచితంగా అడుగుతారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చెప్పిన సమాధానం విని ఆ విద్యార్థినులు బిత్తరపోయారు.

అసలేం జరిగిందంటే.. పాఠశాల విద్యార్థినులతో ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బిహార్‌ ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ హర్‌జోత్‌ కౌర్‌ మాట్లాడుతుండగా.. ‘ప్రభుత్వం ఉచితంగా ఎన్నో ఇస్తోంది. 20 – 30 రూపాయల విలువ చేసే రుతు రుమాళ్లు మాకు ఇవ్వలేరా?’ అని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మహిళా ఉన్నతాధికారి పై విధంగా స్పందించారు. విద్యార్థినులు కూడా వెనక్కు తగ్గలేదు. ‘ఓట్ల కోసం వచ్చినపుడు ఎన్నో హామీలు ఇస్తారు కదా?’ అని నిలదీశారు. దీంతో హర్‌జోత్‌ కౌర్‌ ‘అయితే ఓట్లు వేయకండి. పాకిస్థాన్‌లా మారిపోండి’ అంటూ విద్యార్థులపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news