బీఆర్ఎస్ పాలనపై 154 అంశాలతో బీజేపీ ఛార్జ్​షీట్

-

తెలంగాణలో ఈసారి ఎలాగైనా కేసీఆర్​ను గద్దెదించి కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. ఈ క్రమంలోనే ప్రచారాన్ని వేగవంతం చేసింది. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడింది. ఇందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వంుై 154 అంశాలతో కూడిన ఛార్జ్​షీట్ రూపొందించింది. 2014, 18 మేనిఫెస్టోతో పాటు.. అసెంబ్లీ, సభల్లో కేసీఅర్ ఇచ్చిన హామీలు, అవినీతిని ఈ ఛార్జ్​షీట్​లో ఎండగట్టింది బీజేపీ.

ఇసుక, గ్రానైట్, ల్యాండ్, డ్రగ్, లిక్కర్, కాంట్రాక్ట్ మాఫియా అన్నింట్లో బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ ఛార్జ్​షీట్​లో ఆరోపించింది. సంక్షేమం పేరుతో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో గులాబీ నేతలకు వాటా ఉందని.. వారంతా కమీషన్లు వసూల్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం నేడు కల్వకుంట్ల కుటుంబ పరమైందని మండిపడింది.

రైతును రాజునుచేస్తానని చెప్పిన కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని ఛార్జ్‌షీట్‌లో బీజేపీ ప్రస్తావించింది. సాగుకి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామనేది వాస్తవం కాదని తెలిపింది. ఏకకాలంలో రుణమాఫీ జరగలేదని చెప్పింది. దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి మొదలు దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు వరకు దగా చేసిందని.. ఇలా 154 అంశాలపై బీజేపీ తన ఛార్జ్​షీట్​లో ప్రస్తావించింది.

Read more RELATED
Recommended to you

Latest news