రాజగోపాల్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో మంచి హోదా కల్పించింది : ఎంపీ లక్ష్మణ్

-

బీజేపీకీ మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలుసిందే. తాజాగా రాజససభ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల కృషి శ్రమతో మా కార్యకర్తలు రక్తాన్ని చిందిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి బీజేపీపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరైనది కాదన్నారు. జాతీయస్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఇలాంటి నిందలు వేయడం సరైనది కాదని తెలిపారు లక్ష్మణ్. రాజగోపాల్ రెడ్డి ని బిజెపి గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.


వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాబోతున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన బిజెపి మైత్రితో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని వెల్లడించారు. జాతీయ పార్టీగా బిజెపి జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది.. కానీ కొన్ని పార్టీలు విభజిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకు ఉందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news