వెస్ట్ బెంగాల్ లో మహిళ డాక్టర్ పై జరిగిన అఘాయితన్ని బీజేపీ, బీజేపీ డాక్టర్ సెల్స్ ఖండిస్తుంది అని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. మమత బెనర్జీ ఆ సంఘటన ను కవర్ చేయడానికి ప్రయత్నిస్తే కోర్ట్ సీబీఐ కి అప్పగించింది. ఈ ఘటనలో దోషులకు మరణ శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు . యావత్ దేశం దిగ్భ్రాంతి చెందింది. టీఎంసీ గుండాలు హాస్పిటల్ పై దాడి చేసి సాక్ష్యాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ నీ రాష్ట్ర ప్రభుత్వ అధికార్లు, పోలీస్ లు ధ్వంసం చేశారు. దీదీ మమత బెనర్జీ ఆధ్వర్యం లో అరాచకం నడుస్తుంది. ఆమె చర్యల వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఉగ్రవాద సంస్థలు ఆమె భద్రతలో తల దాచుకున్నారు. దేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మమత బెనర్జీ పై చర్యలు తీసుకోవాలి. వెస్ట్ బెంగాల్ లో సంఘటన జరిగింది కాబట్టి ఇండి అలయన్స్ నోరు మెదపడం లేదు. వెస్ట్ బెంగాల్ కొనసాగుతున్న ఇసిస్ పాలన ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని నర్సయ్య గౌడ్ కోరారు.