రైతు రుణమాఫీ పై BRS ఇప్పటికీ అనవసర విమర్శలు చేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రుణమాఫీ కానీ రైతుల సమస్యల పరిష్కారం రైతు వేదికలు, బ్యాంక్ ల వద్ద వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. రుణమాఫీ సమస్యలు పరిష్కారం చేసి అందరికీ రుణమాఫీ చేస్తాం. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు.. ఆ ఎక్కువ మొత్తం చెల్లిస్తే.. మిగిలిన 2 లక్షలు మాఫీ చేస్తాం.
అయితే ఇప్పటివరకు నాకు అన్ని పార్టీలలో మంచి అవకాశాలు వచ్చాయి. నాకు నేనుగా పార్టీలు మారలేదు.. నాకు పిలిచి పార్టీలు అవకాశాలు ఇచ్చాయి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లా కింద వరి సాగు తగ్గించండి. లిఫ్ట్ ల కింద కమర్షియల్ పంటలు సాగు చేయాలి. సాప్ట్ వేర్ ఉద్యోగుల జీతం, జీవితం కంటే వ్యవసాయ ఆదాయం, జీవితం బాగుంది అనేలా చెయ్యాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.