బీఆర్ఎస్ లోకి బిజెపి నేత కోనేరు సత్యనారాయణ

-

బిజెపి నేత కోనేరు సత్యనారాయణ ఈనెల 25న లేదా 26న బీఆర్ఎస్ లో చేరనున్నారు. రేపు బీజేపీకి రాజీనామా చేయనున్న ఆయన… నిన్న రాత్రి సీఎం కేసీఆర్ ను కలిశారు. పార్టీలో చేరాలని ఆయనను కేసీఆర్ ఆహ్వానించారు. 2014లో కొత్తగూడెం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ మూడేళ్ల క్రితం బిజెపిలో చేరారు.

ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీ కోనేరు సత్యనారాయణ (చిన్ని), పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు భారతీయ జనతా పార్టీ నుంచి ‘సస్పెండ్’ చేశారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version