తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ.. అప్పుడప్పుడూ సామెతలు ఉపయోగిస్తూ తన రాజకీయ ప్రత్యర్ధులపై తనదైన శైలిలో చెలరేగిపోతుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! మాస్ లో కేసీఆర్ కు ఒకరకమైన, మరో రేంజ్ ఫాలోయింగ్ తీసుకొచ్చిందంటే కచ్చితంగా అందుకు సహకరించింది ఆయన వాక్చాతుర్యం.. పదప్రయోగ విధానం అనడంలో సందేహం లేదు! ఈ క్రమంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఆ పదప్రయోగాలు కాస్త తగ్గించారనే చెప్పాలి. ఇప్పుడు ఆ పనికి పూనుకున్నారు బీజేపీ ఎంపీ అరవింద్!
ఎవ్వరూ ఊహించని రీతిలో కేసీఆర్ పై ఫైరయ్యారు బీజేపీ ఎంపీ అరవింద్! తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన… మైకందుకున్నది మొదలు కేసీఆర్ పై నిప్పులు కురిపించారు! “కేసీఆర్ పనికిమాలిన ముఖ్యమంత్రి” … అంటూ మొదలుపెట్టిన అరవింద్… “ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం ఫామ్ హౌస్‌లో ఉంటారా..?” అంటూ కొనసాగించారు!
కేసీఆర్, కేటీఆర్, వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసి… ఓవైసీని జిన్నాతో పోలుస్తావా కేసీఆర్ అంటూ ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెడుతున్న కేసీఆర్… ఒక “దగుల్ బాజీ హిందు” అని… ఓవైసీ, కేసీఆర్ పెద్దకొడుకు అని సంచలన విమర్శలు చేశారు!
ఏది ఏమైనా… తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఒకరిని ఈ రేంజ్ లో తిట్టడమే కానీ, కేసీఆర్ ను ఈ రేంజ్ లో విమర్శించినవారు ఈ మధ్యకాలంలో తక్కువే అని.. పైగా ఆ నేత బీజేపీ ఎంపీ కావడం కొసమెరుపని పలువురు అభిప్రాయపడుతున్నారు! దీనిపై సార్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి!!