రేపటి ధర్నాకు పోలీసుల నిరాకరణ.. హైకోర్టుకు వెళ్లిన బీజేపీ

-

పేదలకు రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయాలంటూ బీజేపీ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగా రేపు ఇందిరాపార్క్ వేదికగా ఆ పార్టీ ధర్నా చేపట్టనుంది. అయితే రేపటి ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ ధర్నాకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టులో బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

మరోవైపు.. రెండు పడక గదుల ఇళ్ల కోసం రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా తలపెట్టిన బీజేపీ.. ఆ ధర్నా విజయవంతం కోసం పార్టీ కార్యాలయంలో.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన అధ్యక్షులు, జీహెచ్అఎంసీ కార్పొరేటర్లతో ఆదివారం రోజున సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి… పేదలకు తక్షణమే పక్కాఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కమలదళం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తామని హెచ్చరించారు. పేదలంటే.. కేసీఆర్ కుటుంబానికి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version