బీజేపీ..ఎన్నికల సమరశంఖం పూరించనుంది. రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే..బీజేపీ పార్టీ ప్రచార రథాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూజలు నిర్వహించనున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో యాత్ర వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐదు క్లస్టర్లలో బస్సుయాత్రల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు.
ఈ సంకల్ప యాత్రలకు ముఖ్య అతిథులు గా అసోం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..రానున్నారు. మోడీ నాయకత్వాన్ని బలపరచడం, కాంగ్రెస్ కపట హామీలను ఎండగట్టడం, తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా యాత్రలు జరుగనున్నాయి. ఇక మక్తల్ లో ప్రారంభం.. నల్గొండలో ముగింపు ఇవ్వనున్నారు బీజేపీ నేతలు. మూడు పార్లమెంట్ నియోజక వర్గాలు(మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ), 21 అసెంబ్లీ నియోజక వర్గాలలో యాత్రలు కొనసాగుతాయి. అన్ని యాత్రలను కలిపి హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ కు ప్లాన్ చేస్తోంది బీజేపీ పార్టీ.